News February 12, 2025
భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739371069688_653-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ వైట్‌వాష్ చేసింది. ఇవాళ జరిగిన చివరి వన్డేలో ఇండియా 142 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 357 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 214 పరుగులకే కుప్పకూలింది. అట్కిన్సన్, బ్యాంటన్ చెరో 38 రన్స్‌తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. IND బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్, హార్దిక్, అక్షర్ తలో 2, సుందర్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు గిల్ <<15440761>>సెంచరీతో<<>> రాణించారు.
Similar News
News February 13, 2025
కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోంది: బండి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735672916360_1045-normal-WIFI.webp)
TG: కులగణనలో లోపాలు, అవకతవకలు జరిగాయని, ఇది బూటకపు సర్వే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడుతోంది. కులగణనను పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంటోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికే రీ-సర్వే డ్రామా. ఆధార్‌ను అనుసంధానిస్తూ ఇంటింటికి వెళ్లి మళ్లీ సర్వే చేయాలి. బీసీ కేటగిరీలో ముస్లింలను చేర్చవద్దు. బీసీ జనాభాను తగ్గించవద్దు’ అని ట్వీట్ చేశారు.
News February 13, 2025
సర్వే సిబ్బంది మీ ఇంటికి రాలేదా? ఇలా చేయండి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373988746_653-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలో ఇంకా 3.1% మంది కులగణనలో పాల్గొనలేదని భట్టి విక్రమార్క తెలపగా సర్వే సమయంలో తమ ఇంటికి సిబ్బందే రాలేదని చాలామంది చెబుతున్నారు. అయితే త్వరలో ప్రభుత్వం ఇచ్చే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సిబ్బందే వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారని భట్టి స్పష్టం చేశారు. మండల కార్యాలయాల్లో ఈనెల 16-28 మధ్య అందుబాటులో ఉండే అధికారులకు, ఆన్‌లైన్‌లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
News February 13, 2025
ఇంగ్లండ్ జట్టుపై కెవిన్ పీటర్సన్ తీవ్ర ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739381362521_1045-normal-WIFI.webp)
భారత్‌తో ODI సిరీస్‌లో ENG జట్టు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ సెషన్ ఆడారు. వారి నిర్లక్ష్యం చూసి నేను షాక్ తిన్నాను. మధ్యలో గోల్ఫ్ మాత్రం ఆడుకున్నారు. వారికి జీతం ఇచ్చేది దేశం కోసం క్రికెట్ ఆడటానికే గానీ గోల్ఫ్ ఆడుకోవడానికి, టూర్‌ని ఎంజాయ్ చేయడానికి కాదు’ అని మండిపడ్డారు.