News February 12, 2025

రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన దుబ్బాక ఆర్ఐ

image

దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి మండలంలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News January 16, 2026

BREAKING: ఫ్లిప్‌కార్ట్‌, మీషో, అమెజాన్‌కు షాక్

image

చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్నందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటా వంటి ఈకామర్స్ సంస్థలపై CCPA కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కో సంస్థకు ₹10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ దాటిన వైర్‌లెస్ పరికరాలకు లైసెన్స్, ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ (ETA) తప్పనిసరి. ముందస్తు అనుమతులు లేదా లైసెన్సింగ్ సమాచారం లేకుండానే వీటిని విక్రయించినట్లు తేలింది.

News January 16, 2026

పాపవినాశనం రోడ్డుపై భారీగా వాహనాలు

image

తిరుమలలో పార్వేట ఉత్సవం ఇవాళ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాపవినాశనం తీర్థానికి వెళ్లేందుకు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అనుమతించ లేదు. గోగర్భం సమీపంలోని గేటు వద్ద సిబ్బంది వాహనాలను అడ్డుకున్నారు. ఆక్టోపస్ భవనం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉత్సవాల కారణంగా వాహనాల అనుమతి కుదరదని విజిలెన్స్ అధికారులు భక్తులకు తెలియజేశారు. పాపనాశనం, ఆకాశంగంగకు అనుమతించాలని భక్తులు కోరుతున్నారు..

News January 16, 2026

నిర్మల్: సదర్మాట్ సాకారం.. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర

image

నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సదర్మాట్ బ్యారేజీ నేడు సాకారం కానుంది. 2017లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పనులు తొమ్మిదేళ్ల తర్వాత పూర్తికాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గోదావరి నదిపై నిర్మించిన ఈ బ్యారేజీని మధ్యాహ్నం సీఎం అంకితం చేయనున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి.