News February 12, 2025

23న జనసేన శాసనసభా పక్ష భేటీ

image

AP: ఫిబ్రవరి 23న జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం జరిగే ఈ భేటీలో పాల్గొనాలని ఎంపీలు, MLAలు, MLCలను పార్టీ ఆదేశించింది. 24వ తేదీన బడ్జెట్ సమావేశాలు పాల్గొననున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Similar News

News February 13, 2025

కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోంది: బండి

image

TG: కులగణనలో లోపాలు, అవకతవకలు జరిగాయని, ఇది బూటకపు సర్వే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడుతోంది. కులగణనను పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంటోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికే రీ-సర్వే డ్రామా. ఆధార్‌ను అనుసంధానిస్తూ ఇంటింటికి వెళ్లి మళ్లీ సర్వే చేయాలి. బీసీ కేటగిరీలో ముస్లింలను చేర్చవద్దు. బీసీ జనాభాను తగ్గించవద్దు’ అని ట్వీట్ చేశారు.

News February 13, 2025

సర్వే సిబ్బంది మీ ఇంటికి రాలేదా? ఇలా చేయండి

image

TG: రాష్ట్రంలో ఇంకా 3.1% మంది కులగణనలో పాల్గొనలేదని భట్టి విక్రమార్క తెలపగా సర్వే సమయంలో తమ ఇంటికి సిబ్బందే రాలేదని చాలామంది చెబుతున్నారు. అయితే త్వరలో ప్రభుత్వం ఇచ్చే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సిబ్బందే వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారని భట్టి స్పష్టం చేశారు. మండల కార్యాలయాల్లో ఈనెల 16-28 మధ్య అందుబాటులో ఉండే అధికారులకు, ఆన్‌లైన్‌లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

News February 13, 2025

ఇంగ్లండ్ జట్టుపై కెవిన్ పీటర్సన్ తీవ్ర ఆగ్రహం

image

భారత్‌తో ODI సిరీస్‌లో ENG జట్టు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ సెషన్ ఆడారు. వారి నిర్లక్ష్యం చూసి నేను షాక్ తిన్నాను. మధ్యలో గోల్ఫ్ మాత్రం ఆడుకున్నారు. వారికి జీతం ఇచ్చేది దేశం కోసం క్రికెట్ ఆడటానికే గానీ గోల్ఫ్ ఆడుకోవడానికి, టూర్‌ని ఎంజాయ్ చేయడానికి కాదు’ అని మండిపడ్డారు.

error: Content is protected !!