News February 12, 2025
పాఠశాలల విలీనంపై మంత్రి సవిత సమీక్ష

పెను కొండ నియోజకవర్గ పరిధిలో పాఠశాలల విలీనంపై జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప, ఎంఈవోలతో మంత్రి సవిత ఆర్&బి అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంతవరకు ఏ పాఠశాలనూ మూసివేయకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను సేకరించాలన్నారు. పాఠశాలలను విలీనం చేసే సమయంలో ఎలాంటి విమర్శలకూ తావివ్వకుండా అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.
Similar News
News July 6, 2025
ప్రేమజంట ఆత్మహత్య!

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
నేడు మంగళంపల్లి జయంతి

నేడు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి. రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తంలో 1930 జులై 6న జన్మించిన బాలమురళీకృష్ణ, తన అసాధారణ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గాయకుడిగా, స్వరకర్తగా, వాగ్గేయకారుడిగా ఆయన సంగీత లోకానికి అందించిన సేవలు అనన్యసామాన్యం. ఆయన పాడిన పాటల్లో ఈ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.
News July 6, 2025
ఎండాడ వద్ద రోడ్డు ప్రమాదం.. బూర్జ మండల వాసి మృతి

ఎండాడ వద్ద RTC బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో శ్రీకాకుళం(D) బూర్జ(M) ఉప్పినివలసకు చెందిన వెంకటరమణమూర్తి(45) మృతి చెందాడు. PMపాలెం CI బాలకృష్ణ వివరాల ప్రకారం.. రమణమూర్తి భార్య, పిల్లలతో కలిసి విశాఖలో ఉంటున్నాడు. శనివారం RDO ఆఫీసుకి వెంకట్రావుతో కలిసి రమణమూర్తి శ్రీకాకుళం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎండాడ వద్ద బస్సును ఓవర్‌టేక్ చేసే సమయంలో ప్రమాదం జరిగి రమణమూర్తి చనిపోగా వెంకట్రావు గాయపడ్డాడు.