News February 12, 2025
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల రేటు పెంచాలి: DMHO
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల రేటు పెంచాలని జిల్లా DMHO గోపాల్ రావు అన్నారు. గీసుగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO తనిఖీ చేసి మాట్లాడారు.ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలన్నారు. పల్లె దవాఖానలో పని చేసే డాక్టర్లు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 13, 2025
పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలి: పీటీసీ ప్రిన్సిపల్
పోలీసులు విధి నిర్వహణలోని మంచి పేరు తెచ్చుకోవాలని మామునూర్ పీటీసీ ప్రిన్సిపల్ పూజ అన్నారు. బుధవారం మామునూర్ క్యాంప్‌లో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన 256 కానిస్టేబుళ్ల శిక్షణకు పూజ హాజరై మాట్లాడారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న ప్రతి విషయం విధి నిర్వహణలో తోడ్పాటు కాగలదని, చెప్పారు. డీఎస్పీలు రమేష్, వేంకటేశ్వర రావు, రవీందర్, పాండునాయక్, పీఆర్ఓ రామాచారి పాల్గొన్నారు.
News February 12, 2025
ముగిసిన రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు
వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిరాటంకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించారు.
News February 12, 2025
ఎనుమాముల మార్కెట్ సెక్రటరీ సస్పెండ్
ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల సస్పెండ్‌కు గురయ్యారు. జిల్లా పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు సంబంధించి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. మార్కెట్ సెక్రటరీ సస్పెండ్ హాట్ టాపిక్‌గా మారింది.