News February 12, 2025
కొత్త 50 రూపాయల నోట్లు
ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈమేరకు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. ఆయన స్థానంలో గతేడాది డిసెంబర్లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త రూ.50 నోట్లను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
Similar News
News February 13, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్‌గా శిఖర్ ధవన్
భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఛాంపియన్స్ ట్రోఫీకి అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అతనితో పాటు PAK క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్, AUS మాజీ ఆల్‌రౌండర్ వాట్సన్, NZ మాజీ పేసర్ సౌథీని ICC అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. 2013లో భారత్ CT గెలవడంలో గబ్బర్ కీలకంగా వ్యవహరించారు. అలాగే, టోర్నీ చరిత్రలో వరుసగా 2సార్లు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డ్ అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచినందుకు శిఖర్‌కు ఈ గౌరవం దక్కింది.
News February 13, 2025
దేశంలోనే కర్నూలులో హై టెంపరేచర్
AP: రాష్ట్రంలో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలులో బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 37.8°C నమోదైంది. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
News February 13, 2025
రేషన్ కార్డులు.. ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఫిర్యాదు చేయండిలా!
TG: రేషన్ కార్డు దరఖాస్తు కోసం మీ-సేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణ జరిపి వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీ-సేవ హెల్ప్ లైన్ నంబర్ 1100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.