News March 20, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,100 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,550 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

Similar News

News September 8, 2025

స్థానిక ఎన్నికల జాబితాపై అఖిలపక్ష సమావేశం

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 8, 2025

ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలన్నారు.

News September 8, 2025

ఖమ్మం: గణేశ్‌ ఉత్సవాలపై సీపీ ప్రశంసపీ

image

గణేశ్‌ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు శ్రమించిన పోలీసు, హోంగార్డు సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ అభినందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక నవరాత్రుల నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉత్సవాలు జరగడానికి సహకరించిన భక్తులకు, వివిధ శాఖల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.