News March 20, 2024
యువకులు సంతోషంగా ఉన్న దేశం ఇదే!
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-2024 ప్రకారం లిథువేనియాలో అత్యంత సంతోషకరమైన యువకులు (30 ఏళ్లలోపు) ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఇజ్రాయెల్, సెర్బియా, ఐస్‌లాండ్, డెన్మార్క్ ఉన్నాయి. మొత్తం 143 దేశాల్లో భారత్ 27వ స్థానంలో నిలిచింది. అయితే, ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితాలో ఇండియా 126వ ర్యాంకులో ఉంది.
Similar News
News November 25, 2024
తొలిరోజు వేలం తర్వాత SRH, CSK, RCB, MI జట్లు
SRH: అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, హర్షల్, కమిన్స్, షమీ, రాహుల్ చాహర్, జాంపా, సిమర్‌జీత్, అథర్వ
CSK: రుతురాజ్, జడేజా, పతిరణ, దూబే, నూర్, అశ్విన్, కాన్వే, ఖలీల్, రచిన్, ధోనీ, త్రిపాఠీ, విజయ్ శంకర్
MI: బుమ్రా, హార్దిక్, సూర్య, రోహిత్, బౌల్ట్, తిలక్, నమన్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ
RCB: విరాట్, హేజిల్‌వుడ్, సాల్ట్, పటీదార్, జితేశ్, లివింగ్‌స్టోన్, రసిఖ్, యశ్ దయాళ్, సుయాశ్
News November 25, 2024
నవంబర్ 25: చరిత్రలో ఈరోజు
1926: 21వ సీజేఐ రంగనాథ్ మిశ్రా జననం
1964: వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం
1968: సినీ దర్శకుడు ముప్పలనేని శివ జననం
1972: సినీ నటి సుకన్య జననం
2010: ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు మరణం
2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో మరణం(ఫొటోలో)
* అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం
News November 25, 2024
యానిమల్‌లో హింస.. స్పందించిన రణ్‌బీర్
యానిమల్ మూవీలో హింసను ప్రధానంగా చూపించారన్న ఆరోపణలపై ఆ మూవీ హీరో రణ్‌బీర్ కపూర్ ఓ ఈవెంట్‌లో స్పందించారు. ‘ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కళాకారులు సమాజహితమైన సినిమాలు చేయాలి. అది మా బాధ్యత. కానీ నటుడిగా వివిధ రకాల జానర్లలో వివిధ పాత్రల్ని నేను పోషించాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. తన తాత రాజ్‌కుమార్ జీవితంపై బయోపిక్ తీసేందుకు యోచిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.