News February 13, 2025

MNCL: ‘ఒక్కో పదవికి ఒక్కో రంగు బ్యాలెట్ పేపర్’

image

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, విధుల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఆచరించాలని సూచించారు. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు గులాబి రంగు, జడ్పీటీసీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ వినియోగించనున్నట్లు తెలిపారు.

Similar News

News September 15, 2025

‘అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి’

image

సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఇన్‌ఛార్జి సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్ సోమవారం అన్నారు. స్వస్తి నారి శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

News September 15, 2025

ఉదయగిరి: ఏటీఎం మార్చి నగదు కాజేసిన కేటుగాడు

image

ఉదయగిరిలో ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన సినిమా హాల్ వీధికి చెందిన ఓ మహిళ తన ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కి వచ్చింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని కోరింది. దీంతో ఆ వ్యక్తి కొంత డబ్బులు డ్రా చేసి ఆమెకు సంబంధించిన ఏటీఎం కార్డు ఇవ్వకుండా వేరే కార్డు మార్చి అందులోని రూ.8 వేలు నగదును ఆ కేటుగాడు కాజేశారు.

News September 15, 2025

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ

image

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గీతాంజలి శర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆమె పనితీరు ప్రశంసలు పొందింది. ఇకపై ఫైబర్ నెట్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త జాయింట్ కలెక్టర్‌పై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.