News February 13, 2025

KMR: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: ASP

image

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం మాచారెడ్డిలో ఆమె పర్యటించారు. రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై స్థానిక పోలీసులకు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ వెంట రూరల్ సీఐ రామన్, ఎస్ఐ అనిల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Similar News

News September 16, 2025

తిరుపతి: భయపెడుతున్న ‘కిడ్నీ’ భూతం

image

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పాలెంపాడు గ్రామాన్ని కిడ్నీ భూతం భయపెడుతోంది. దాదాపు 100 మంది వరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన సగిలాల వెంకటేశ్వర్లు(32) తిరుపతిలో డయాలసిస్ చేయించుకుంటూ సోమవారం మృతిచెందారు. ఈ గ్రామంలోని కిడ్నీ బాధితులంతా నిరుపేదలే. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయం భయంగా జీవిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

News September 16, 2025

ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చూడాలి: కలెక్టర్

image

ప్రతి రైతుకు యూరియా అందే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మరిపెడ PACS పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సొసైటీ వద్దకు వచ్చిన రైతులకు నీడ, మంచి నీటి వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా సరఫరా చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా అమ్మకాల రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు.

News September 16, 2025

తిరుపతి: APR సెట్-24 కన్వీనర్‌గా ఉష

image

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో వివిధ కోర్సులకు సంబంధించిన పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించనున్న ఏపీఆర్ సెట్ నిర్వహణ బాధ్యతలు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఆచార్యులకు దక్కాయి. ఆర్‌సెట్ కన్వీనర్‌గా వర్సిటీ బయోటెక్నాలజీ విభాగాధిపతి ఆచార్య ఆర్.ఉష, కోకన్వీనర్‌గా అదే భాగానికి చెందిన ఎన్.జాన్ సుష్మను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.