News March 20, 2024
అనంత: కర్ణాటక మద్యం తరలిస్తున్న వాలంటీర్ అరెస్ట్..

గుమ్మగట్ట మండలం పూలుకుంట గ్రామం వాలంటీర్ హనుమంతు కర్ణాటక నుంచి 380 టెట్రా మద్యం ప్యాకెట్లు బైక్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా సరిహద్దు ప్రాంతంలో పట్టుకున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.9,800 నగదుతో పాటు బైక్, కర్ణాటక మద్యం సీజ్ చేసి అతడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు .
Similar News
News January 20, 2026
ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
News January 20, 2026
జేఎన్టీయూ-ఏ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన M.Tech (R21), M.Sc (R21) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం www.jntuaresults.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News January 20, 2026
అనంతపురం: ఉద్యోగుల వైద్య శిబిరానికి స్పందన

అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఇన్ఛార్జ్ కలెక్టర్‌తోపాటు కలెక్టరేట్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.


