News February 13, 2025
వైభవంగా రంగనాయక స్వామి వారి కళ్యాణం

భద్రాచలం రామాలయం అనుబంధ ఆలయమైన రంగనాయక స్వామి వారి ఆలయంలో మాఘ పూర్ణిమను పురస్కరించుకొని బుధవారం గోదా రంగనాయక స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి మేళతాళాలు మంగళ వాయిధ్యాలు, వేద మంత్రాలు నడుమ రాజ వీధిలో తిరువీధి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News November 8, 2025
తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 8, 2025
చంద్రుడిపై నీరు, మంచు జాడను కనుగొనడంలో కీలక ముందడుగు!

2019లో చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్-2 తన మిషన్‌ను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్‌లోని ఇస్రో SAC సైంటిస్టులు దాని DFSA రాడార్ నుంచి ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషిస్తున్నారు. సుమారు 1,400 రాడార్ డేటాసెట్స్‌ను కలెక్ట్ చేసి ప్రాసెస్ చేశారు. తొలిసారి చంద్రుడి పూర్తి పొలారిమెట్రిక్, L-బ్యాండ్ రాడార్ మ్యాప్‌లను రూపొందించారు. ఇది చంద్రుడి ఉపరితలంపై నీరు, మంచు జాడలను కనుగొనేందుకు దోహదపడనుందని భావిస్తున్నారు.
News November 8, 2025
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన తెలిసిందే. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, శనివారం రాత్రి యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


