News March 20, 2024
నెల్లూరు జిల్లాలో హత్య

కుమారుడే తండ్రిని హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఇందుకూరుపేట మండలం డేవిస్ పేటలో కుటుంబ కలహాలతో భార్య వెంకట రమణమ్మపై భర్త ప్రసాద్ గడ్డపారతో దాడి చేశాడు. ఈక్రమంలో భార్య కోమాలోకి వెళ్లింది. ఇది గమనించిన వాళ్ల పెద్ద కుమారుడు మహేశ్ గడ్డపారతో తండ్రిని పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Similar News
News February 8, 2026
నెల్లూరు: మురుగుతున్న MP LADS

నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎంపీలైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావులకు భారత ప్రభుత్వం MP LADS ను కేటాయిస్తుంది. వేమిరెడ్డికి రూ. 9.80 కోట్లను కేటాయించగా.. రూ. 5.06 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయని సమాచారం. బీద మస్తాన్ రావుకు రూ.12.22 కోట్లు ఇవ్వగా రూ.3.37 కోట్లకు పనులు చేపట్టారు. కనీసం కొన్ని పనులు కూడా మొదలెట్టలేదంటే ఎలా ఖర్చు చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
News February 7, 2026
నెల్లూరు: రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

మనుబోలు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఫ్లాట్ ఫామ్ చివరన చెన్నై నుంచి విజయవాడ వెళ్లే లైన్‌లో గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని శనివారం సాయంత్రం మృతి చెందింది. వయస్సు సుమారు 50-55 ఏళ్లు ఉండొచ్చని, 5.0అడుగుల ఎత్తు కలిగి చాయా రంగు కలిగి ఉందని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. మృతురాలు సిమెంట్ రంగుపై బులుగు రంగు సిల్క్ చీర, ఆకుపచ్చ పావడాను ధరించి ఉందని అన్నారు.
News February 7, 2026
సోమిరెడ్డికి కాకాణి సవాల్

నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దోచుకున్నారన్నారు. ఈ అక్రమాలపై సీఎంకు లేఖ రాసినా స్పందన లేదని మండిపడ్డారు. అవినీతి ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, విజిలెన్స్ విచారణకు సిద్ధమా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.


