News February 13, 2025
చిత్తూరు నేతలకు కీలక పదవులు ఇచ్చిన జగన్

చిత్తూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా కే.పీ. శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే చిత్తూరు రూరల్ అధ్యక్షుడిగా జయపాల్, గుడిపాల మండల అధ్యక్షుడిగా జై ప్రకాశ్‌ని నియమించారు. తమకు అవకాశం కల్పించిన జగన్, విజయనందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.
Similar News
News November 11, 2025
మౌలానాకు నివాళులు అర్పించిన ఎస్పీ

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం నివాళులు అర్పించారు. దేశ తొలి విద్యామంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నిరక్షరాస్యత పేదరికం రూపుమాపడానికి అనేక సేవలు చేశారని వెల్లడించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు.
News November 11, 2025
పూతలపట్టు: అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా

పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గల జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఐచర్ వాహనం అతివేగంగా వెళ్లి బోల్తా పడింది. ఇందులో ఉన్న దానిమ్మ కాయలు కోసం ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి.
News November 11, 2025
చిత్తూరు: విస్తృతంగా పోలీసుల తనిఖీ

ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా అన్ని ముఖ్యమైన రహదారులు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు, హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


