News February 13, 2025

MSP సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలి: VZM SP

image

క్షేత్ర స్థాయిలో MSPల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. విధి నిర్వహణ పట్ల MSPలకు దిశా నిర్దేశం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో వారి సేవలను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని కోరారు. ప్రతీ వారం MSPలతో సమావేశాలు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో విషయాలను తెలుసుకోవాలన్నారు.

Similar News

News January 15, 2026

VZM: చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

image

వేపాడ మండలం బొద్దాం నుంచి రామస్వామిపేట వేళ్లే తారు రోడ్డులో బొద్దాం రైల్వే గేట్ సమీపంలో నర్సిపల్లి మెట్టకు చెందిన అన్నదమ్ములు బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గోపు రామదాసు (26) సంఘటన స్థలంలో చనిపోగా గోపు రామచంద్ర (28)అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అంబులెన్స్‌లో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 14, 2026

పట్టువర్ధనంలో పండగ వేళ విషాదం

image

వంగర మండలం పట్టువర్ధనంలో బుధవారం పండగ పూట విషాదం నెలకొంది. గ్రామస్థుడు రాజు కుమార్ (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితులతో కలసి పడవపై మడ్డువలస రిజర్వాయర్‌లో ప్రయాణించాడు. ప్రమాదవశాత్తు మధ్యలో పడవ బోల్తా పడగా..ఈత రాక రాజు కుమార్ నీట మునిగి మృతి చెందాడు. భార్య వాణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం డెడ్ బాడీని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు.

News January 14, 2026

అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

image

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాథ చిన్నారులతో జరుపుకున్నారు. కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శిశువుల ఆశ్రమాన్ని తన సతీమణితో బుధవారం సందర్శించి శిశుగృహంలో చిన్నారులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు.