News February 13, 2025
కాకినాడ: కన్నబాబుకు హైకమాండ్ కీలక బాధ్యతలు

మాజీ మంత్రి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు పార్టీ పదోన్నతి కల్పించింది. ఆయనను ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ గా నియమించింది. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఆయన స్థానంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించారు. కన్నబాబుకు కీలక పదవి ఇవ్వడంతో ఆయన అభిమానులు, జిల్లా వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 20, 2026
లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి? సింపుల్ ఫార్ములా..

‘10 టైమ్స్ యాన్యువల్ ఇన్‌కమ్’ అనేది ఒక వ్యక్తికి ఎంత మొత్తంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలో లెక్కించే సులభమైన పద్ధతి. దీని ప్రకారం ఏడాది ఆదాయానికి కనీసం 10 రెట్ల లైఫ్ కవర్ ఉండాలి. Ex వార్షిక ఆదాయం ₹15 లక్షలు అయితే ₹1.5 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అప్పులు లేదా అదనపు బాధ్యతలు ఉంటే మాత్రం ఇది సరిపోదు.
News January 20, 2026
తూ.గో: వరకట్న వేధింపులు.. భర్తకు 18 నెలల జైలు శిక్ష

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయి కరిముల్లాకు 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ వీరరాఘవరావు మంగళవారం తీర్పునిచ్చారు. ధవళేశ్వరానికి చెందిన సయ్యద్ సమీన తబసుమ్‌ను అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో 2012లో రాజమహేంద్రవరం మహిళా పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది.
News January 20, 2026
మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘మళ్లీ గర్భవతి అయ్యాను. మా ఇల్లు మరింత హాయిగా, సందడిగా మారబోతోంది. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని ప్రియా మోహన్ సైతం బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అట్లీ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


