News February 13, 2025

సంగారెడ్డి: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

image

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.

Similar News

News February 13, 2025

వల్లభనేని వంశీ అరెస్ట్.. వైసీపీ సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం ఉదయం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఆయనకు మద్దతుగా #WE STAND WITH VALLABHANENI VAMSI’ అంటూ హాష్ ట్యాగ్‌ను Xలో వైరల్ చేస్తోంది.

News February 13, 2025

SnapChatలో రికార్డు సృష్టించారు!

image

మీరెప్పుడైనా స్నాప్‌చాట్ వాడారా? అందులో ఇద్దరు స్నేహితులు కలిసి స్నాప్ పంపించుకుంటే స్ట్రీక్ స్టార్ట్ అవుతుంది. రోజూ ఒక స్నాప్ (ఫొటో/వీడియో) పంపిస్తుంటే స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. ఇలా కాటీ &ఎరిన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ 3662+ స్ట్రీక్‌తో రికార్డు సృష్టించారు. అంటే వీరి స్నాప్ జర్నీ పదేళ్లు దాటిందన్న మాట. వీరి తర్వాత లెస్లీ & జయ్నబ్ (3536+), ఎర్మిరా & జవి (3528+) ఉన్నారు. మీ హైయెస్ట్ స్ట్రీక్స్ ఎంత?

News February 13, 2025

SRD: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

error: Content is protected !!