News February 13, 2025

MNCL: జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులు

image

జాతీయ ఉపకార వేతనాలకు(NMMS) జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీఎస్ఎస్ విద్యార్థులు 11 మంది ఎంపికయ్యారని HM రాజన్న తెలిపారు. ఈ 11 మంది విద్యార్థులకు ఏటా రూ.12,000 చొప్పున స్కాలర్షిప్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. స్కాలర్షిప్ పరీక్షల్లో విజయం సాధించిన 11 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News February 13, 2025

బైరెడ్డిపల్లి: సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన యువకుడు

image

బైరెడ్డిపల్లికి చెందిన మేస్త్రి కృష్ణప్ప కుమారుడు విశ్వనాథ్ సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్న.. నా భార్య, కూతురును బాగా చూసుకోండి. నేను చనిపోయాక వచ్చే చంద్రన్న బీమా, ఇన్సూరెన్స్ నగదు నేను ఇవ్వాల్సిన అప్పుల వాళ్లకు ఇచ్చి మిగిలిన డబ్బులు నా భార్య బిడ్డలకు ఇవ్వండి’ అని లెటర్‌లో రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తన తండ్రి తెలిపాడు.

News February 13, 2025

ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు: లావణ్య

image

TG: అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించారు. ‘పదుల సంఖ్యలో అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేశాడు. ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు. ప్రతిక్షణం భయంతో బతుకుతున్నా. నాకేం జరిగినా మస్తాన్ సాయి కుటుంబానిదే బాధ్యత. జీవితం, నా మనిషిని కోల్పోయా. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని సారీ చెప్పాలనుకుంటున్నా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు’ అని లావణ్య అన్నారు.

News February 13, 2025

నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపుతోంది.

error: Content is protected !!