News February 13, 2025
ములుగు: ఇసుక అక్రమ రవాణాపై ఎస్పీ నజర్

ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎస్పీ శబరీశ్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లో రుసుము చెల్లించి తవ్వకాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని వాగులు, నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసిన, నిల్వ ఉంచిన చట్ట ప్రకారం జరిమానా, కేసులు నమోదు చేయాలన్నారు.
Similar News
News November 5, 2025
నరసాపురం: నేషనల్ లాన్ టెన్నిస్ పోటీలకు ఏంజిలిన్ ఎంపిక

నరసాపురానికి చెందిన గోడి స్పార్క్ ఏంజిలిన్ జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ క్రీడా పోటీలకు ఎంపికైంది. ఈ నెల 3న శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి 14 ఏళ్ల లోపు బాలికల టెన్నిస్ విభాగంలో ఏంజిలిన్ మూడో స్థానం సాధించింది. దీంతో డిసెంబరులో హర్యానా రోహతక్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె అర్హత సాధించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, క్రీడాభిమానులు అభినందించారు.
News November 5, 2025
పెట్టుబడులపై అవగాహన కల్పించండి: మంత్రి కొండపల్లి

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలు, తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి వారికి పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అన్నారు.
News November 5, 2025
తిరుపతి: హాస్టల్లో విద్యార్థులపై లైంగిక దాడి.?

తిరుపతిలోని ఓ బాలుర హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. నైట్ వాచ్మెన్ ఇద్దరు మైనర్ బాలురుపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న ఓ బాలుడు ఈ విషయాన్ని పేరంట్స్కు ఫోన్ ద్వారా చెప్పగా వెంటనే వారు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు పోక్సో, SC, ST యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


