News February 13, 2025
దోమకొండ: గుండెపోటుతో యువకుడి మృతి

దోమకొండ మండలం అంబర్ పేట్ గ్రామానికి చెందిన నీల అరవింద్(19) అనే యువకుడు బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. అరవింద్ తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా అరవింద్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చురుకుగా ఉంటారని స్థానికులు తెలిపారు. యువకుడి మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News September 18, 2025
వరంగల్: వామ్మో.. ఇంతమంది ఉన్నా..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఇద్దరు IASలు, ముగ్గురు IPSలతో జిల్లా మొత్తం నడిచేది. చిన్న జిల్లాలు అయ్యాక ఏకంగా ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలకు ఆరుగురు కలెక్టర్లతో పాటుగా మరో ముగ్గురు IASలు ఉండగా, 10 మంది IPSలు పని చేస్తున్నారు. పెద్ద జిల్లాగా ఉన్న సమయంలో ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ అధికారి మొత్తం జిల్లాను పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఇంతమంది సివిల్ సర్వెంట్లున్నా చెప్పుకోదగ్గ పనులేవి లేవని ప్రజలు అంటున్నారు.
News September 18, 2025
ఈనెల 21న ‘OG’ ట్రైలర్

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిన ‘OG’ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 21న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేస్తామంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈనెల 25న విడుదలయ్యే ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా టికెట్ <<17742687>>ధరలను<<>> పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులిచ్చింది. తెలంగాణలో ధరలు పెరుగుతాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
News September 18, 2025
ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (1/2)

‘తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం’
పండిత దైవజ్ఞ సూర్య సూరి రచించిన శ్రీ రామకృష్ణ విలోమ కావ్యంలోని శ్లోకమిది. ముందు నుంచి చదివినా, వెనుక నుంచి చదివినా ఈ శ్లోకం ఒకేలాగా(వికటకవి లాగ) ఉంటుంది. ఎడమవైపు నుంచి చదివితే శ్రీరాముణ్ని, కుడివైపు నుంచి చదివితే శ్రీకృష్ణుణ్ని స్తుతించేలా ఉన్న ఈ శ్లోకం అద్భుతం కదా!