News February 13, 2025
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ROలు నోటిఫికేషన్ జారీ చేసిన రోజే నామినేషన్ స్వీకరించాల్సి ఉంటుందన్నారు.
Similar News
News January 19, 2026
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఉప్పుగల్: మన ఊరు-మన బడి బిల్లులు రాక స్కూలుకు తాళం
> జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి
> బచ్చన్నపేట: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
> గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
> స్టేషన్ ఘనపూర్: మైనారిటీ విద్యార్థులకు అడ్మిషన్ల అవకాశం
> మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎర్రబెల్లి
> గాదె ఇన్నయ్యను హైదరాబాద్కు తరలించిన ఎన్ఐఏ అధికారులు
News January 19, 2026
కామారెడ్డి: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యం

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం ప్రగతి పథంలో పయనిస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డిలోని కళాభారతిలో ఏర్పాటు చేసిన ఐకేపీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐకేపీ సంఘాల సేవలు వెలకట్టలేనివన్నారు. పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో మహిళలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
News January 19, 2026
శాంతి భద్రతల్లో కొత్త అధ్యాయం!

జిల్లాలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ నేతృత్వంలో శాంతిభద్రతలు మెరుగయ్యాయి. నేరాల సంఖ్య తగ్గుతూ ప్రజల్లో భరోసా పెరిగింది. యువతను వ్యసనాల నుంచి దూరం పెట్టే అవగాహన కార్యక్రమాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజా పోలీసింగ్కు బలం చేకూరింది. రోడ్డు భద్రతపై డీటీఓ మహమ్మద్ సందాని ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.


