News February 13, 2025
కేంద్రమంత్రిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా రైతులు

విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ ప్యాకేజీ- 3కి సంబంధించిన సమస్యలను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరితో కలిసి వారు ఢిల్లీలో గడ్కరీని కలిశారు. ప్యాకేజీ- 3లో సర్వీస్ రోడ్ కేటాయింపు తదితర అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అధికారులతో చర్చించి ఆయా అంశాలను పరిష్కరిస్తామన్నారు.
Similar News
News March 12, 2025
రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

ప్రాథమిక రంగం వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం అనంతపురంలోని ఆదిమూర్తి నగర్లో ఉన్న జిల్లా హార్టికల్చర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. వివిధ రకాల పంటలు పండిస్తున్న రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు.
News March 12, 2025
Stock Markets: టెక్ షేర్లు విలవిల..

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,470 (-27), సెన్సెక్స్ 74,029 (-72) వద్ద స్థిరపడ్డాయి. PVT బ్యాంకు, హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, బ్యాంకు, చమురు, ఎనర్జీ షేర్లు ఎగిశాయి. ఐటీ, రియాల్టి, మీడియా, PSU బ్యాంకు, వినియోగ, మెటల్ షేర్లు ఎరుపెక్కాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటామోటార్స్, కొటక్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ టాప్ గెయినర్స్. ఇన్ఫీ, విప్రో, టెక్ఎం, నెస్లే, TCS టాప్ లూజర్స్.
News March 12, 2025
EAPCET నోటిఫికేషన్ విడుదల

AP: EAPCET <<15723472>>నోటిఫికేషన్‌ను <<>>JNTU కాకినాడ విడుదల చేసింది. దీని ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.