News February 13, 2025

భద్రాద్రి: బైక్, లారీ ఢీ.. ఒకరు మృతి

image

ఇసుక లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గోగుబాక వద్ద జరిగింది. స్థానికుల వివరాలిలా.. దుమ్ముగూడెం మండలం జడ్ వీరభద్రవరం గ్రామానికి చెందిన కొమరం రాంబాబు బైక్‌పై వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతదేహం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News March 13, 2025

పెద్ద కార్పాముల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

పెద్దకొత్తపల్లి మండల పరిధిలో మార్చి 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. పెద్దకొత్తపల్లి నుంచి పెద్దకార్పాములకు రాములు, స్వామిలు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందెళ్తున్న బైక్‌ని ఢీకొని కిందపడగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరినీ HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా బుధవారం రాములు చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు.

News March 13, 2025

రోజూ చికెన్ తింటున్నారా?

image

చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. అయితే రోజూ చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.

News March 13, 2025

గ్రూప్-1లో సత్తాచాటిన పెగడపల్లి మండల వాసి

image

పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన గాలిపెల్లి రాజమౌళి- అనూష కుమార్తె గాలిపెల్లి స్నేహ ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 517 మార్కులతో రాష్ట్రస్థాయి 485వ ర్యాంకు సాధించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్ సాధించడం పట్ల ఆమెను పలువురు అభినందించారు. ఆమె తండ్రి స్వర్ణకార వృత్తి చేస్తుండగా తల్లి కుట్టు మిషన్ కుడుతుంది.

error: Content is protected !!