News February 13, 2025
మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739405583469_782-normal-WIFI.webp)
భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మార్చిలో భూమి మీదకు రానున్నారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆమె మార్చి మధ్యలో రానున్నట్లు NASA తెలిపింది. సునీతతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా రానున్నట్లు పేర్కొంది. వీరిద్దరిని తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని వెల్లడించింది.
Similar News
News February 13, 2025
పోలీసుల నోటీసులపై పోచంపల్లి రియాక్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739435110152_1226-normal-WIFI.webp)
TG: <<15447380>>పోలీసుల నోటీసులపై<<>> MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫామ్ హౌజ్ తనదేనని, రమేశ్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. అతను వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఫామ్ హౌస్ వెళ్లి ఎనిమిదేళ్లు దాటినట్లు చెప్పారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించినట్లు తెలిపారు. కాగా కోడి పందేలు జరిగాయని గేమింగ్, యానిమల్ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
News February 13, 2025
అప్పుడు పంత్‌ను కాపాడి.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739434109952_653-normal-WIFI.webp)
2022లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్‌ను కాపాడిన యూపీ యువకుడు రజత్(21) ప్రస్తుతం చావుతో పోరాడుతున్నాడు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని ఈనెల 9న ప్రియురాలు మన్నూతో కలిసి అతడు విషం తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరినీ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే నిన్న మన్నూ మృతి చెందగా రజత్ పరిస్థితి విషమంగా ఉంది.
News February 13, 2025
వంశీ అరెస్టు సరికాదు: బొత్స
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739434081848_1226-normal-WIFI.webp)
AP: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు తగవన్నారు. తొమ్మిది నెలల అధికారాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని విమర్శించారు.