News February 13, 2025
కాకినాడ: జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజా
మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. జిల్లాకు చెందిన ఇద్దరి కాపు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించింది.
Similar News
News February 13, 2025
వంశీ అరెస్టు సరికాదు: బొత్స
AP: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు తగవన్నారు. తొమ్మిది నెలల అధికారాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని విమర్శించారు.
News February 13, 2025
భీంపూర్‌లో చిరుత.. స్పందించిన అధికారులు
భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో చిరుత పులి కదలిక పై ఎఫ్ఎస్‌వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవో శ్రీనివాస్ స్పందించారు. నిపాని శివారులోని లింగారెడ్డి అనే రైతుకు చెందిన పంట చేనులో చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డయిందన్నారు. గురువారం పంట చేనుకు వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 13, 2025
MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.