News February 13, 2025
సిద్దిపేట: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

జేఈఈ మెయిన్స్ సెషన్ వన్ పరీక్ష ఫలితాల్లో హుస్నాబాద్ మండలంలోని జిల్లా గడ్డ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ రాజు తెలిపారు. సునీల్ 81.8%, సిద్ధార్థ 77.33%, మోక్షజ్ఞ 77.04%, విష్ణు 74.81%, అజయ్ 73.56%, ప్రేమ్ చరణ్ 71.96%, 16 మంది విద్యార్థులకు పైగా 60% మార్కులు సాధించారని తెలిపారు.
Similar News
News September 16, 2025
ADB: కాంగ్రెస్ గూటికి మాజీ నేతలు

TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు మాజీ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇందులో మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.
News September 16, 2025
కరీంనగర్: బతుకమ్మ చీరలు మాకు లేవా..?

బతుకమ్మ పండుగ సందర్భంగా అందించే చీరలను మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే అందజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాగా, గత BRS ప్రభుత్వం రేషన్ కార్డుల్లో పేరుండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని మహిళా సంఘాల్లో సభ్యత్వం లేని మహిళలు అంటున్నారు. సభ్యత్వం ఉన్నవారికే బతుకమ్మ చీరలా? మాకు లేవా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా, ఉమ్మడి KNRలో దాదాపు 45,350 మహిళా సంఘాలు ఉన్నాయి.
News September 16, 2025
హుకుంపేట: JCBని ఢీ కొట్టిన బైక్.. యువకుడి మృతి

పాడేరు మండలం చింతలవీధి సమీపంలో ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. దాలిగుమ్మడి గ్రామానికి చెందిన థామస్ ప్రవీణ్ హుకుంపేట నుంచి పాడేరుకు బైక్‌పై వస్తూ JCBని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు పాడేరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.