News February 13, 2025

కులగణనపై రేపు పీసీసీ ప్రజెంటేషన్

image

TG: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ రేపు మ.2 గంటలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. గాంధీ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.

Similar News

News February 13, 2025

అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో భారీగా బలగాల్ని మోహరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ప్రకటించారు. ర్యాలీలు, సభల వంటివాటిపై నిషేధం ఉంటుందని, ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.

News February 13, 2025

సీఎం రేవంత్‌ను గద్దె దించే ప్రయత్నం.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

image

TG: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని కోసం 25 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. మరోవైపు ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

News February 13, 2025

గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

image

APలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ OTPR ID, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

error: Content is protected !!