News February 13, 2025

బాపట్ల: అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య

image

సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు ఎన్ఎస్పీ కాలువ వద్ద అప్పుల బాధతో విత్తనాల వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు పసుమర్తిపాలెంకు చెందిన సుబ్బారెడ్డిగా సంతమాగులూరు పోలీసులు గుర్తించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 1, 2025

MHBD: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడకల గదుల నిర్మాణ పథకం అమలు పురోగతిపై సంబధిత అధికారులతో కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. పేదల సొంతింటి నిర్మాణం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు క్షేత్రస్థాయిలో తీసుకొని సర్వే, మార్కింగ్, గ్రౌండింగ్ పురోగతిలో ముందుకు సాగాలన్నారు.

News November 1, 2025

హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలు..!

image

ప్రొద్దుటూరు హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రొద్దుటూరు హౌసింగ్ కాలనీల్లో రూ.1,25,16,285ల విలువైన 13678.92MTల బల్క్ శాండ్ దుర్వినియోగమైనట్లు పలువురు ఆరోపించారు. AE వెంకటేశ్వర్లు, WI గుర్రప్ప, ఇందిర, కుమారిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు వివరాలు కోరుతూ.. DEE నుంచి ప్రొద్దుటూరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News November 1, 2025

‘ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్’ అంటే..

image

ఇదొక దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య. ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో మెదడు, పేగులు కలిసి పనిచేయవు. దీనివల్ల పేగుల్లో సున్నితత్వం పెరుగుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, నిద్రలేమి, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తం, మల పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం, ఫ్యాట్, ప్రాసెస్డ్, కారంగా ఉండే ఫుడ్స్‌కు దూరంగా ఉంటే ఈ సమస్యను అదుపుచేయవచ్చు.