News March 20, 2024
కొత్తగూడెం: ఆన్సర్ షీట్లకు బదులు అడిషనల్ షీట్స్

ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పాల్వంచలోని KTPS పాఠశాలలో పదో తరగతి తెలుగు పరీక్ష జరిగింది. విద్యార్థులకు ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్స్‌కి బదులు అడిషనల్ షీట్స్ ఇచ్చారు. విద్యార్థులు అందులోనే జవాబులు రాశారు. మరుసటి రోజు హిందీ పరీక్ష రాశాక జరిగిన తప్పును గ్రహించి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని ఎంఈవో రామ్మూర్తి చెప్పారు.
Similar News
News April 10, 2025
ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి: ఖమ్మం కలెక్టర్

రఘునాథపాలెం: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.
News April 10, 2025
ఖమ్మం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఖమ్మంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఎర్రుపాలెంలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ముదిగొండలో 40.8, నేలకొండపల్లిలో 40.5, ఖమ్మం(U) ఖానాపురం PS, ఖమ్మం(R) పల్లెగూడెంలో 40, లింగాల (కామేపల్లి), కారేపల్లిలో 39.2, సత్తుపల్లిలో 39, మధిరలో 38.6, మంచుకొండ (రఘునాథపాలెం) 38.5, తల్లాడలో 38.5, కల్లూరులో 37.5, గౌరారం ( పెనుబల్లి) 37.1 నమోదైంది.
News April 10, 2025
ఆత్మీయ కానుక ఆడపిల్ల: జిల్లా కలెక్టర్

ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం తల్లిదండ్రులకు భగవంతుడు ఇచ్చిన ఆత్మీయ కానుక అని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మా పాప మా ఇంటి మణి దీపం కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆడబిడ్డకు జన్మించిన మౌనిక- సురేశ్ దంపతులను బుధవారం కలెక్టర్ ఖమ్మం సారధినగర్లోని వారి నివాసంలో శాలువాతో సన్మానించారు. ఇంటిలో అమ్మాయిలు ఉంటే ఇల్లు కళ కళ లాడుతుందని, ప్రతి ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించాలని పేర్కొన్నారు.