News February 13, 2025
ప.గో : కోళ్ల నుంచి కుక్కలకు.. మనుషులకు సోకే ఛాన్స్

ఉమ్మడి ప.గో జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇదే క్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో కుక్కలు కూడా చర్మవ్యాధులతో దర్శనమిస్తున్నాయి. అయితే కోడి వ్యర్థాలు తినడం వలనే కుక్కలు ఈ విధంగా బాధపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. గాలి ద్వారా ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Similar News
News July 5, 2025
పాలకొల్లు: మూడు రోజుల వ్యవధిలో తల్లి కూతురు మృతి

పాలకొల్లులో ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో సంగినీడి జయశ్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఆరోపిస్తూ ఆరోజు బంధువులు ఆందోళన చేపట్టారు. శిశువుకు వైద్యం కోసం భీమవరం తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం వైద్యులు ఇంటికి పంపించేశారు. శనివారం ఉదయం శిశువు మృతి చెందింది. తల్లి, కూతురు మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News July 5, 2025
ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News July 5, 2025
మొగల్తూరు: చేపకు మనిషి లాంటి దంతాలు

మొగల్తూరు సుబ్రహ్మణ్యేశ్వం రోడ్లో ఒక రైతుకు చెందిన చేపల చెరువులో రూపు చందు చేపల్లో ఒక చేప వింత పోలికలతో కనిపించింది. మనిషిని పోలిన దవడ పళ్లు ఉన్న చేప దొరికింది. ఇది హర్యానా జాతికి చెందిన చేపని మత్స్యకారులు అంటున్నారు. చేపల పెంపకం దారులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని లేదంటే వేళ్లను కొరికే ప్రమాదం ఉంటుందంటున్నారు.