News February 13, 2025
దేశంలోనే కర్నూలులో హై టెంపరేచర్

AP: రాష్ట్రంలో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలులో బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 37.8°C నమోదైంది. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Similar News
News November 10, 2025
జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు మాతృవియోగం

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాతృమూర్తి కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్‌లో అంతిమయాత్ర సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News November 10, 2025
హజ్ యాత్రపై సౌదీతో ఒప్పందం.. భారత్ కోటా ఎంతంటే..

హజ్ యాత్రకు సంబంధించి భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2026 సంవత్సరానికి గాను భారత్ కోటా కింద 1,75,025 మంది యాత్రికులకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్డాలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సౌదీ మంత్రి తౌఫిక్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. హజ్ ఏర్పాట్ల గురించి వీరిద్దరూ సమీక్షించారు. కోఆర్డినేషన్, రవాణా మద్దతు, తీర్థయాత్ర సజావుగా సాగడం వంటి అంశాలపై చర్చించారు.
News November 10, 2025
నేటి నుంచి గ్రూప్ -3 పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ నెల 26వరకు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 జిరాక్స్ సెట్లు తీసుకెళ్లాలి.


