News February 13, 2025

వీరఘట్టం: అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య

image

అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీరఘట్టంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మణరావు(38) కొన్నేళ్లుగా కాలేయ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో గడ్డిమందు తాగాడు. గుర్తించిన భార్య చోడవరపుదేవి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.

Similar News

News February 13, 2025

మంత్రి సురేఖపై పరువునష్టం దావా.. విచారణ 27కు వాయిదా

image

TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సురేఖ ఇప్పటికే క్షమాపణ చెప్పారని ఆమె తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన విమర్శలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేదని నాగార్జున తరఫు లాయర్ పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

News February 13, 2025

కుంభమేళాలో చాయ్‌వాలా ఆదాయం తెలిస్తే షాక్!

image

కోట్లమంది రాకతో మహా కుంభమేళా వద్ద తిండి పదార్థాలు, టీలు, కాఫీలు, వాటర్ బాటిళ్లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. అక్కడ టీ, కాఫీ అమ్ముతూ ఓ చాయ్‌వాలా ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. అతడి సంపాదన నిత్యం రూ.7000. అందులో రూ.2000 ఖర్చులు పోను రూ.5000 మిగులుతున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. అంటే కుంభమేళా జరిగే నెలరోజుల్లో అతడి ఆదాయం రూ.1.50లక్షలకు పైనేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News February 13, 2025

లోక్‌సభ ముందుకు కొత్త IT బిల్లు

image

లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్‌సభను వాయిదా వేశారు.

error: Content is protected !!