News February 13, 2025
భూపాలపల్లి జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 13, 2025
వరంగల్ జిల్లాలో చలి పంజా

వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలికాలం మొదలైంది. ఉదయాన్నే విపరీతమైన చలితో పాటు మంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా కొనసాగుతోంది. దీంతో రోడ్లపై వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా జాకెట్లు, మఫ్లర్లు ఉపయోగించాలని వైద్యులు సూచించారు.
News November 13, 2025
అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు

AP: ఈ నెల 17న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. నిన్న అల్లూరిలోని ముంచింగి పుట్టులో 14.4, డుంబ్రిగుడలో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 13, 2025
ఖమ్మం: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

సూర్యాపేట(D) చిలుకూరు (M) కట్టకొమ్ముగూడెంకు చెందిన కృష్ణ, నల్గొండ (D) నకిరేకల్ (M) ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్‌ను SRPT పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా SRPT, KMM, MLG, NLGతో పాటు HYD, APలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతని వద్ద KMM వాసులకు చెందిన 6 బైక్‌లు ఉన్నాయి.


