News February 13, 2025

వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా కన్నబాబు

image

వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం కమిటీ ప్రకటన జారీ చేసింది. వైసీపీ హయాంలో కన్నబాబు మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా కొనసాగారు. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కన్నబాబు నియామకం చేపట్టారు.

Similar News

News February 13, 2025

విశాఖ: కాలేజీ పైనుంచి దూకి విద్యార్థి సూసైడ్

image

విశాఖలో బుధవారం అర్ధరాత్రి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా రాష్ట్రం రాయపూర్‌కి చెందిన చంద్రవంశీ (17) బోరవాణి పాలెంలోని నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. అర్ధరాత్రి కాలేజీ 5వ అంతస్థు నుంచి దూకి చంద్రవంశీ మృతి చెందాడు. మృతదేహాన్ని KGHకి తరలించారు. పీఎంపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. CITU నాయకులు గురువారం ఉదయం ఘటనా స్థలిని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2025

షీలా నగర్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

గాజువాక షీలా నగర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. మృతుడు తుంగ్లాం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు. స్కూటీపై వెళ్తున్న ప్రవీణ్ రోడ్డుపై విగత జీవిగా పడిఉన్నాడు. ఘటనా స్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందా.. ఏదైనా వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

News February 13, 2025

రూ.8వేలతో విశాఖ నుంచి కుంభమేళాకు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి కుంభమేళాకు ప్రత్యేక బస్సు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 16న ద్వారకా బస్సు స్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడుపబడునన్నారు. టికెట్ ధర రూ.8 వేలు. టికెట్స్ కావలసినవారు ఆన్‌లైన్ ద్వారా గాని, సమీప బస్ స్టేషన్లోగాని పొందవచ్చన్నారు.

error: Content is protected !!