News February 13, 2025
డోన్‌లో అద్భుత దృశ్యం

డోన్ పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన షిర్డీ సాయిబాబా ఆలయంపై మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు వెలిగిపోతూ దర్శనమిచ్చారు. నేడు సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు ఆలయానికి వెలుగును ప్రసాదిస్తున్నట్లుగా అరుదైన దృశ్యం కనిపించింది. స్థానికులు ఆసక్తిగా తిలకించి తన ఫోన్లలో బంధించారు.
Similar News
News November 12, 2025
రాజన్న ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయంలోకి ప్రవేశం నిలిపివేసిన క్రమంలో ఆలయం ముందు భాగంలో మూసివేసిన గేటు ముందు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో రాజన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News November 12, 2025
గేటు వద్ద వేములవాడ రాజన్నకు మొక్కులు..!

వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనం కోసం ప్రవేశం నిలిపివేసిన నేపథ్యంలో ఆలయం బయటనే భక్తులు రాజన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న దర్శనం కోసం దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఆలయ ముందు భాగంలోని గేటు బయట కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టి.. రాజన్న మళ్లీ వస్తాం అని తిరిగి వెళుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన వైనం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది.
News November 12, 2025
HYD రానున్న.. ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో HYDకు రానున్నారు. CM రేవంత్ రెడ్డి రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికకు మెస్సీని బ్రాండ్ అంబాసడర్‌గా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక ద్వారా తెలంగాణను 2033 నాటికి 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.


