News February 13, 2025

వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కురసాల

image

వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కాకినాడకు చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పటివరకు ఆ పదవి ఖాళీగా ఉంది.

Similar News

News February 13, 2025

చోరీ చేసింది వీళ్లే: కథలాపూర్ ఎస్ఐ నవీన్

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో బుధవారం వృద్ధురాలి మెడలో నుంచి ఇద్దరు యువతులు బంగారం దొంగిలించిన సంగతి తెలిసిందే. ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీని స్థానిక ఎస్ఐ నవీన్ కుమార్ గురువారం విడుదల చేశారు. అనాథ పిల్లలకు డోనేషన్ ఇవ్వాలంటూ వారు గ్రామాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని, ఈ ఫొటోలో ఉన్న యువతులను ఎవరైనా గుర్తిస్తే తన ఫోన్ నంబర్ 8712656793కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

తిరుపతి: కంప్యూటరైజేషన్‌తో రైతులకు సేవలు- కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థ బలోపేతానికి పలు చర్యలు చేపడుతోందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో  సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ ద్వారా రైతులకు త్వరలో విస్తృత సేవలు అందించనుందని ఆయన అన్నారు. ప్రతి రైతు ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు.

error: Content is protected !!