News February 13, 2025

కాలేజీ విద్యార్థులకు అపార్ ఐడీలు

image

TG: కాలేజీ విద్యార్థులకు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(అపార్) IDలను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు వన్ నేషన్-వన్ స్టూడెంట్ ID ప్రోగ్రామ్ కింద వీటిని జూన్ నాటికి జారీ చేయాలని కాలేజీలను ఆదేశించింది. విద్యార్థుల అకడమిక్ అచీవ్‌మెంట్స్, సర్టిఫికెట్స్, క్రెడిట్స్ డిజిటల్‌గా స్టోర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఆధార్, పేరెంట్స్ అనుమతి తప్పనిసరి.

Similar News

News February 13, 2025

రూ.500 ఇచ్చి ఫొటో పంపిస్తే.. కుంభమేళాలో స్నానం!

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న ‘మహాకుంభమేళా’ను ఇప్పటికే 45 కోట్ల మంది భక్తులు సందర్శించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా మంది పాల్గొనలేకపోతున్నారు. అలాంటి వారిని ‘ముంచేందుకు’ కొందరు పథకం పన్నుతున్నారు. రూ.500 చెల్లించి ఫొటోలు వాట్సాప్ చేస్తే వాటిని త్రివేణి సంగమంలో ముంచుతామని, ఇలా చేస్తే మీరు స్నానం చేసినట్లేనని ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

News February 13, 2025

చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

image

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

News February 13, 2025

శ్రీలంక విద్యుత్ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్న అదానీ

image

శ్రీలంకలో తాము నిర్మించాల్సిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తప్పుకొంటున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. ఆ దేశంలో ఏర్పడిన కొత్త సర్కారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని యోచిస్తోంది. అది తమకు అంతగా లాభించదన్న ఆలోచనతోనే అదానీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ బిలియన్ డాలర్ల వరకూ ఉండటం గమనార్హం.

error: Content is protected !!