News February 13, 2025

అడ్డాకుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్‌పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News January 17, 2026

దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్‌లు తెలంగాణా నుండే రావాలి- CM

image

దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి గ్రామంలో త్రిబుల్ ఐటీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు.

News January 17, 2026

మరికాసేపట్లో ఎంవీఎస్ మైదానానికి సీఎం రేవంత్

image

మహబూబ్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి భారీ నిధులతో కూడిన ప్రాజెక్టులకు ఆయన ఇక్కడ నుంచి పునాది వేయనున్నారు. సభ కోసం మైదానానికి జనం భారీగా చేరుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.

News January 17, 2026

పాలమూరు తొలి మేయర్‌గా బీసీ మహిళ

image

మహబూబ్ నగర్ కార్పొరేషన్ రిజర్వేషన్ ఖరారు అయింది. రిజర్వేషన్లలో మేయర్ స్థానాన్ని బీసీ మహిళగా ఖరారు చేస్తూ అధికారులు ప్రకటించారు. దీంతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ అయిన తర్వాత తొలి మేయర్‌గా బీసీ మహిళ అందాల ఎక్కబోతుంది. కాగా పాలమూరు మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించడంతో బీసీ సంఘాలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.