News February 13, 2025
అన్నమయ్య జిల్లాలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

కె.వి పల్లి మండలం, తీతా గుంటపల్లి పంచాయతీ ఈతమాను వడ్డిపల్లి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి రాయచోటికి వస్తున్న కారు పొగమంచు కారణంగా మోరీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108 సహాయంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 30, 2025
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్!

రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోనున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. కాగా దీనిపై హీరోహీరోయిన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.
News December 30, 2025
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై బ్యాంకర్లు దృష్టి సారించాలి: అ. కలెక్టర్

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల విజయవంతానికి బ్యాంకర్లు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో మాట్లాడారు. రెండో త్రైమాసికం ముగిసే నాటికి జిల్లాలో ప్రాధాన్యత రంగం కింద నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యంలో 54.15 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు.
News December 30, 2025
కొత్తగా నెల్లూరు జిల్లా ఇలా..!

☞ డివిజన్లు: 4(నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు)
☞ మండలాలు: 36
☞ జనాభా: 22,99,699
☞ నియోజకవర్గాలు: 8
☞ కందుకూరును ప్రకాశంలో కలపడంతో ఆ డివిజన్‌లోని కొండాపురం, వరికుంటపాడు మండలాలు కావలి డివిజన్‌లోకి చేరాయి. కలువాయిని ఆత్మకూరులో, రాపూరు, సైదాపురాన్ని నెల్లూరు డివిజన్‌లో విలీనం చేశారు. 3మండలాలతోనే గూడూరు(కోట, వాకాడు, గూడూరు) డివిజన్ ఉంటుంది.


