News March 20, 2024
పిఠాపురంలో జనసేనకు షాక్

AP: పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగలనుంది. జనసేన తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గత కొంతకాలంగా జనసేనకు దూరంగా ఉంటున్న ఆమె.. వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని తాజాగా నిర్ణయించుకున్నారు. అయితే ఆమె వెళ్లినా తమకు ఇబ్బంది లేదని.. పవన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జనసైనికులు చెబుతున్నారు.
Similar News
News November 2, 2025
ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్

ఎన్నో రహస్యాలకు నెలవైన నింగికి చందమామే అందం. ఆ చంద్రుడు ఈ నెల 5న మరింత పెద్దగా, కాంతిమంతంగా కనివిందు చేయనున్నాడు. ఇది ఈ ఏడాదిలోనే బీవర్ సూపర్ మూన్గా నిలవనుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ రోజున జాబిలి భూమికి 356,980KM దగ్గరకు వస్తుందని పేర్కొంటున్నారు. దీన్ని చూడటానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదంటున్నారు. కాగా డిసెంబర్లోనూ ఓ కోల్డ్ మూన్ అలరించనుంది.
News November 2, 2025
HYDకు మెస్సీ.. వారంలో బుకింగ్స్

ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ డిసెంబర్లో హైదరాబాద్కు రానున్నారు. కేరళ ప్రోగ్రామ్ రద్దవడంతో HYDను చేర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి/రాజీవ్ గాంధీ స్టేడియంలో వేదిక ఉంటుందని, వారంలో బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. GOAT Cupలో భాగంగా డిసెంబర్ 12/13 తేదీల్లో మెస్సీ కోల్కతా చేరుకుంటారు. అదే రోజు HYD, 14న ముంబై, 15న ఢిల్లీలో సెలెబ్రిటీలతో ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడతారు.
News November 1, 2025
సానుభూతితో ఓట్లు దండుకోవాలనేది BRS యత్నం: రేవంత్

TG: జూబ్లీహిల్స్లో సానుభూతితో ఓట్లు దండుకోవాలని BRS ప్రయత్నిస్తోందని CM రేవంత్ ఆరోపించారు. ‘2007లో PJR చనిపోతే ఏకగ్రీవం కాకుండా అభ్యర్థిని నిలబెట్టే సంప్రదాయానికి KCR తెరదీశారు. పదేళ్ల పాటు మైనార్టీ సమస్యలు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 70వేల ఉద్యోగాలిచ్చాం. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన KTR.. సునీతను బాగా చూసుకుంటారా?’ అని విమర్శించారు.


