News February 13, 2025
గాంధీభవన్‌లో రేపు యువజన కాంగ్రెస్ ప్రమాణం

రేపు గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనున్నట్లు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
Similar News
News July 4, 2025
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. sensex 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. nifty 55 పాయింట్లు లాభపడి 25,461 వద్ద ట్రేడింగ్ ముగించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ, విప్రో, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ M&M షేర్లు నష్టపోయాయి.
News July 4, 2025
ASF: ‘మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి’

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని ఆసీఫాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఇక్కడ ఇరువురి చిత్రపటాలకు ASF కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే, ఎమ్మెల్యే కోవాలక్ష్మి నివాళులర్పించారు. మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జేసీ డేవిడ్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.
News July 4, 2025
నిర్మల్: కలెక్టరేట్‌లో ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడైన దొడ్డి కొమురయ్య గురించి నేటి తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.