News March 20, 2024
ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ హెచ్చరిక
AP: ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలు/అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా, పార్టీల నుంచి బహుమతులు తీసుకున్నా చర్యలు తప్పవంది. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు అందితే తగిన చర్యలు చేపడతామంది.
Similar News
News January 7, 2025
YS జగన్ సమీప బంధువు మృతి
AP: YS జగన్ సమీప బంధువు అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో మూడు నెలల నుంచి కోమాలో ఉన్న ఆయన HYD AIGలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. YS ప్రకాశ్ రెడ్డి మనవడు అయిన ఆయన జగన్‌కు సోదరుడి వరుస అవుతారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ విజయం కోసం ఆయన తీవ్రంగా పనిచేశారు. బెంగళూరులో స్కూలు విద్యాభ్యాసం, ఖమ్మం మమతా కాలేజీలో MBBS చదివారు.
News January 7, 2025
ALERT.. రేపటి నుంచి జాగ్రత్త
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనవరి 8 నుంచి 11 వరకు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం వేళ పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
News January 7, 2025
టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ ఈవో
AP: తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి పది రోజుల్లో 7.5 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 3వేల మంది పోలీసులు, 1500 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తామని తెలిపారు. టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠద్వార దర్శనాలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో వీఐపీలు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు.