News February 13, 2025
మిగిలిన వారికి త్వరలో రైతు భరోసా: తుమ్మల
TG: జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్లను జమ చేసినట్లు వివరించారు. మిగిలిన వారికీ త్వరలోనే నిధులు జమ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా సాయాన్ని వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు.
Similar News
News February 13, 2025
రైతులకు 9 గంటల విద్యుత్ అందాల్సిందే: మంత్రి గొట్టిపాటి
AP: వేసవిలో విద్యుత్ కోతలు ఉండరాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లులను చెల్లించారనే ఆరోపణలపై ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోష్‌రావును వివరణ కోరారు. ఈ విషయంలో సీఎం అసంతృప్తిని ఎండీకి వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని సూచించారు.
News February 13, 2025
రూ.500 ఇచ్చి ఫొటో పంపిస్తే.. కుంభమేళాలో స్నానం!
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న ‘మహాకుంభమేళా’ను ఇప్పటికే 45 కోట్ల మంది భక్తులు సందర్శించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా మంది పాల్గొనలేకపోతున్నారు. అలాంటి వారిని ‘ముంచేందుకు’ కొందరు పథకం పన్నుతున్నారు. రూ.500 చెల్లించి ఫొటోలు వాట్సాప్ చేస్తే వాటిని త్రివేణి సంగమంలో ముంచుతామని, ఇలా చేస్తే మీరు స్నానం చేసినట్లేనని ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
News February 13, 2025
చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!
AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.