News February 13, 2025
లింగంపేట: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన లింగపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ అనిల్ వివరాల ప్రకారం.. మండలానికి చెందిన కుర్ర వెంకటి (25) 3 నెలల క్రితం ఆరేపల్లిలో చెరుకు కొట్టడానికి వెళ్లాడు. కాగా బుధవారం చెరకు కొట్టి గుడిసెలోనికి వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News July 6, 2025
ఇంజినీరింగ్.. ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్లు?

TG: ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుండగా <<16970142>>సీట్ల<<>> వివరాలను అధికారులు వెల్లడించారు. కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా CSEలో 26,150 సీట్లు, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 12,495 సీట్లు, ECEలో 10,125, CSE డేటా సైన్స్‌లో 6,996, EEEలో 4,301, ITలో 3,681, సివిల్ ఇంజినీరింగ్‌లో 3,129, మెకానికల్‌లో 2,994 సీట్లు ఉన్నాయి.
News July 6, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ జిల్లావ్యాప్తంగా పశు వైద్య కేంద్రాల్లో రేబీస్ వ్యాక్సిన్లు
➤ తొలి ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్న జిల్లా ప్రజలు
➤ PGRSకు రాలేనివారు ఆన్లైన్ లోనూ ఫిర్యాదులు చేయవచ్చు: కలెక్టర్
➤ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
➤ ఉద్యోగులకు మద్యంతర భృతి కల్పించాలి: యూటీఎఫ్
➤ ఉపమాకలో గరుడాద్రి పర్వతం చుట్టూ గిరి ప్రదర్శన
➤ అనకాపల్లిలో ఘనంగా జగన్నాధుని తిరుగు రథయాత్ర
News July 6, 2025
కొడిమ్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

కొడిమ్యాల మండలం తుర్క కాశీనగర్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సెంటర్ల పల్లి గ్రామానికి చెందిన బుచ్చిబాబు వేములవాడ మండలానికి చెందిన మారుతిలు పని నిమిత్తం కరీంనగర్ వైపు స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల-కరీంనగర్ హైవేపై వెళ్తున్న లారీ స్కూటీని ఢీ కొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.