News March 20, 2024

యలమంచిలి: ట్రాక్టర్‌ని ఢీకొన్న బస్సు.. వ్యక్తి మృతి

image

యలమంచిలి మండలం పులపర్తి హైవే జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం వొమ్మవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షేక్ మీరా సాహెబ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు.

Similar News

News December 25, 2025

స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం

image

జీవీఎంసీ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిందని అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి తెలిపారు. జీవీఎంసీ హాల్లో సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపరేషన్ లంగ్స్ లో దుకాణాలు తొలగింపు చేయడం జరిగిందని, విశాఖను అందంగా తీర్చిదిద్దేందుకు రూ.1425 కోట్లతో 250 దుకాణాలను మొదటి ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి జోన్లో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అన్ని జరుగుతాయని తెలిపారు.

News December 25, 2025

విశాఖలో పబ్ నిర్వాహకులకు సీపీ వార్నింగ్

image

విశాఖపట్నం నగరంలోని బార్, పబ్ నిర్వాహకులతో పోలీస్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ధ్వని కాలుష్యం, అక్రమ పార్కింగ్, డ్రగ్స్ వాడకం, మైనర్లకు మద్యం సరఫరాపై సీపీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత సమయపాలన పాటించాలని, సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రతే తమ ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు.

News December 25, 2025

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు: సీపీ

image

విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ.. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.