News February 13, 2025

బంగారం ధరలు.. తగ్గేదేలే

image

బంగారం ధర మరోసారి రూ.87వేల మార్క్ దాటింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.87వేల దిగువకు వచ్చింది. ఇవాళ మళ్లీ రూ.380 పెరగడంతో రూ.87,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 పెరగడంతో రూ.79,800గా నమోదైంది. అటు కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉండే అవకాశం ఉంది.

Similar News

News February 13, 2025

తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్

image

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని ఆమె స్పష్టం చేశారు.

News February 13, 2025

ముగ్గురు పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. ఐసీసీ చర్యలు

image

ముక్కోణపు వన్డే(PAK-NZ-SA) సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ICC కొరడా ఝుళిపించింది. SA బ్యాటర్ మాథ్యూను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న షాహీన్ అఫ్రీదికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. అలాగే కెప్టెన్ బవుమాను రనౌట్ చేసిన తర్వాత సౌద్ షకీల్, కమ్రాన్ గెటౌట్‌ అంటూ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఐసీసీ వారిద్దరి ఫీజులో 10 శాతం కట్ చేసింది.

News February 13, 2025

19న BRS విస్తృతస్థాయి సమావేశం

image

TG: ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని KCR నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై KCR అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేయనున్నారు.

error: Content is protected !!