News February 13, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన చికెన్ సేల్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739407097727_893-normal-WIFI.webp)
ఏపీలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోవడంతో చికెన్ తినడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. HYDలో సేల్ 50% తగ్గిందని వ్యాపారులు తెలిపారు. TGలో వైరస్ వ్యాప్తి లేకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం వల్ల జనం భయందోళన చెందుతున్నారని అంటున్నారు. అయితే చికెన్‌ను 70-100 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఏ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.
Similar News
News February 13, 2025
తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739448171412_81-normal-WIFI.webp)
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని ఆమె స్పష్టం చేశారు.
News February 13, 2025
ముగ్గురు పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. ఐసీసీ చర్యలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739447150055_695-normal-WIFI.webp)
ముక్కోణపు వన్డే(PAK-NZ-SA) సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ICC కొరడా ఝుళిపించింది. SA బ్యాటర్ మాథ్యూను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న షాహీన్ అఫ్రీదికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. అలాగే కెప్టెన్ బవుమాను రనౌట్ చేసిన తర్వాత సౌద్ షకీల్, కమ్రాన్ గెటౌట్ అంటూ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఐసీసీ వారిద్దరి ఫీజులో 10 శాతం కట్ చేసింది.
News February 13, 2025
19న BRS విస్తృతస్థాయి సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736617762335_1226-normal-WIFI.webp)
TG: ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని KCR నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై KCR అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేయనున్నారు.