News February 13, 2025

కాకినాడ: వేరు వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య

image

కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా బుధవారం ఇరువురు మృతి చెందారు. అల్లూరిలోని గంగవరానికి చెందిన వీర ప్రసాద్ (27) గడ్డి మందు తాగి మృతి చెందాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడుకు చెందిన ఏసుబాబు (54) వేరే వారి గేదె చనిపోవడానికి తనే కారణమని ఆరోపించారు. రూ. 25 వేలు చెల్లించాలని పెద్దలు తీర్మానించారు. దీంతో విషం తాగి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 6, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి: కలెక్టర్

image

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరకాలలోని ధనలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు 13 మంది రైతుల నుంచి 140 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పత్తి విక్రయించిన వెంటనే డబ్బులు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News November 6, 2025

HYD: 108వ భారత ఆర్థిక సంఘం బ్రోచర్ విడుదల

image

108వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సు బ్రోచర్‌ను ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని EC గదిలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం విడుదల చేశారు. ఈ సదస్సు డిసెంబర్ 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు భారత ఆర్థికవ్యవస్థను ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, విధాన నిర్వాహకులు, పరిశోధకులను ఒకే వేదికపై తీసుకురానుంది.

News November 6, 2025

HYD:”ఓయూలో ఓరియంటేషన్ ప్రోగ్రాం”

image

ఓయూ టెక్నాలజీ కళాశాలలో బీ ఫార్మసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్ హాజరై మాట్లాడారు. 108 ఏళ్ల చారిత్రక ప్రయాణంలో ఓయూ విద్యారంగంలో సమాజ నిర్మాణంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. విద్యార్థులకు విశ్వస్థాయి విద్యను అందించాలన్నదే లక్ష్యమన్నారు. బీఫార్మసీకి చాలా మంచి డిమాండ్ ఉందన్నారు.