News February 13, 2025

HYD: పాఠాలు చెబుతూ.. అనుకున్నది సాధించా: SI

image

మొయినాబాద్‌ SI (ప్రొబేషన్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జబీనా బేగం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు. పాఠాలు చెబుతూ పేదరికం అనే అడ్డు గోడలను దాటి అనుకున్నది సాధించారు. ‘నా విజయం.. నా స్నేహితులు వారి సహకారం, ప్రోత్సాహంతో సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. ఆమె చెల్లెలు కూడా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారని వివరించారు.

Similar News

News February 13, 2025

MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBIRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. గురువారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. బ్యూటీ పార్లర్ & ఎంబ్రాయిడరీలలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో ఈనెల 17లోపు దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.

News February 13, 2025

సిద్దవటం: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 5 ఏళ్ల జైలు శిక్ష

image

సిద్దవటం పీఎస్ పరిధిలో 2015 సం.లో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 5 సం.ల జైలు శిక్ష, అలాగే ఒక్కొక్కరికి రూ. 1,000 జరిమానా విధిస్తూ గురువారం బద్వేల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జీ పద్మ శ్రీ కోర్టులో తీర్పు ఇచ్చారు. సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి, శిక్ష పడేలా కృషి చేసిన కె.రవిచంద్ర APP బద్వేల్‌, పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.

News February 13, 2025

తాడేపల్లి: రేపు కడప వెళ్లనున్న మాజీ సీఎం

image

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ శుక్రవారం కడప వెళ్లనున్నట్లు పార్టీ సెంట్రల్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని తెలిపారు.

error: Content is protected !!