News February 13, 2025
మున్సిపాలిటీలకు టెన్షన్‌గా పన్ను వసూళ్లు

ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు పన్ను వసూళ్లు టెన్షన్‌గా మారింది. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర మున్సిపాలిటీల్లో 50% పైగా ఆస్తి పన్నులు వసూళ్లయ్యాయి. వైరా మున్సిపాలిటీలో కేవలం 27 శాతమే వసూళ్లయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్షలో లక్ష్యానికి దూరంగా మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించినట్టు సమాచారం.
Similar News
News July 10, 2025
ఖమ్మంలో ఈ నెల 11న జాబ్ మేళా..!

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఖాళీగా ఉన్న 25 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన వారికి రూ.20 వేలు నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు 11 గంటలకు జరిగే మేళాలో పాల్గొనాలని సూచించారు.
News July 10, 2025
రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు: ఖమ్మం DAO

జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి D.పుల్లయ్య తెలిపారు. బుధవారం సత్తుపల్లి రామానగరంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు MRPకి మించి అధిక ధరలకు విక్రయించొద్దని హెచ్చరించారు. ఒక ఎరువు కొంటే మరొకటి కొనమని రైతులను ఒత్తిడి చేయవద్దని సూచించారు.
News July 9, 2025
రాష్ట్ర వ్యాప్తంగా 8.81 లక్షల దరఖాస్తులు: పొంగులేటి

గత ప్రభుత్వంలో రైతులను కష్టపెట్టిన ధరణిని తొలగించి భూభారతి తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 8.81 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. రైతుల భూ సమస్యలు పరిష్కరించి సంపూర్ణ హక్కులు కల్పిస్తామన్నారు. న్యాయస్థానం విచారణలో ఉన్నవి మినహా అన్నింటికీ పరిష్కారం చూపుతామని పొంగులేటి పేర్కొన్నారు.